Twitter: ట్విటర్‌ డౌన్‌.. పలు యూజర్లకు లాగిన్‌ సమస్యలు

ట్విటర్‌ సేవలకు అంతరాయం కలిగింది. ట్విటర్‌ ఖాతాలను లాగిన్‌ చేయలేకపోతున్నామని పలువురు యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

Updated : 05 Jan 2023 13:48 IST

దిల్లీ: భారత్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సేవల్లో అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా పలు యూజర్లకు లాగిన్‌ సమస్యలు తలెత్తడంతో వారు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ట్విటర్ వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే ట్విటర్‌ డౌన్‌ అయినట్లు చూపిస్తోందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకే ఈ సమస్య మొదలవ్వగా.. ఉదయానికి మరింత మందికి లాగిన్‌ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల పాటు ఈ అంతరాయం కలగగా.. ఆ తర్వాత సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.

ఇదిలా ఉండగా.. గతవారం ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న అపర కుబేరుడు మస్క్‌ సంస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. బ్లూటిక్‌కు ఛార్జీలు వసూలు చేయడం, ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల కోత వంటి నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వారం నుంచే ట్విటర్‌ బ్లూటిక్‌ ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలుకానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని