Ahmedabad Blasts: అహ్మదాబాద్‌ పేలుళ్లపై భాజపా కార్టూన్‌ వివాదం.. తొలగించిన ట్విటర్‌

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో చోటుచేసుకున్న వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Published : 21 Feb 2022 12:41 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో చోటుచేసుకున్న వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై భాజపా ఇటీవల ఓ కార్టూన్‌ రూపొందించగా.. అది కాస్తా వివాదానికి దారితీసింది. దీంతో ఆ పోస్ట్‌ను ట్విటర్‌ తొలగించింది. 

తీర్పు వెలువడిన మరుసటి రోజు భాజపా గుజరాత్‌ ట్విటర్‌ ఖాతాలో ఓ కార్టూన్‌ ప్రత్యక్షమైంది. కొంతమందికి సామూహికంగా ఉరివేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటో వెనుక జాతీయ జెండాతో పాటు సత్యమేవ జయతే అనే పదాలు రాసి ఉన్నాయి. అయితే ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఓ వర్గం వారిని కించపర్చేలా కార్టూన్‌ను రూపొందించారంటూ భాజపాపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దీనిపై సోషల్‌మీడియా సంస్థకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్‌ను ట్విటర్‌.. భాజపా గుజరాత్‌ ఖాతా నుంచి తొలగించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి యోగేశ్ దవే తెలిపారు. 

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో మొత్తం 49 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. ఇందులో 38 మందికి మరణ శిక్ష విధిస్తూ గతవారం తీర్పు వెలువరించింది. మిగతా 11 మంది యావజ్జీవ కారాగార శిక్ష విధించంది. 2008లో జరిగిన ఈ పేలుళ్ల ఘటనలో 56 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని