Sanskrit shlokas: పదేళ్లకే సంస్కృతంలో పాండిత్యం

ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరి పేర్లు వాచస్పతి(9), వేదాంత్‌(10). రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వీరు అమరకోశం, స్తోత్ర రత్నావళి, భగవద్గీత, రామచరిత మానస్‌ వంటి గ్రంథాల్లోని కఠినమైన శ్లోకాలను అలవోకగా పఠిస్తారు.

Updated : 15 Nov 2022 07:19 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న వీరి పేర్లు వాచస్పతి(9), వేదాంత్‌(10). రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వీరు అమరకోశం, స్తోత్ర రత్నావళి, భగవద్గీత, రామచరిత మానస్‌ వంటి గ్రంథాల్లోని కఠినమైన శ్లోకాలను అలవోకగా పఠిస్తారు. కరోనా కాలంలో దొరికిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని వారు సుమారు 1500 శ్లోకాలను నేర్చుకున్నారు. ఆ సమయంలో వేదాంత్‌ తండ్రి (వాచస్పతి బాబాయ్‌) శాస్త్రి కౌశలేంద్ర దాస్‌.. సంస్కృత పద్యాలు చదువుకోవాలని వీరిద్దరికీ సూచించారు. దీంతో పద్యాలను కంఠస్తం చేయగలిగినట్లు బాలలు చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదువుకునే వారు ప్రత్యేక శ్రద్ధతో సంస్కృతాన్ని నేర్చుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని