Jammu: జమ్మూలో మరో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లోని కుల్గామ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Published : 30 Jun 2022 02:15 IST

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని కుల్గామ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. నవపొరాలోని మీర్‌ బజార్‌ ప్రాంతంలో లష్కరే తొయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. సైనిక బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభంకానుంది. ఈ యాత్రకు ఇప్పటికే జమ్మూలోని బేస్ క్యాంప్‌ల వద్దకు వందలాది మంది భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సైన్యం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి ఉగ్రవాదుల జాడను పసిగడుతున్నాయి. కాగా.. 43 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర జూన్‌ 30న మొదలై ఆగస్టు 11న ముగియనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని