Udaipur case: ఉదయ్‌పూర్‌ నిందితులను 30కి.మీ. వెంటాడిన గ్రామస్థులు..!

ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు గౌస్‌ మహమ్మద్‌, మహమ్మద్‌ రియాజ్‌లను ఇద్దరు గ్రామస్థులు తెలివిగా వెంటాడి పోలీసులకు పట్టించారు.

Updated : 05 Jul 2022 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు గౌస్‌ మహమ్మద్‌, మహమ్మద్‌ రియాజ్‌లను ఇద్దరు గ్రామస్థులు తెలివిగా వెంటాడి పోలీసులకు పట్టించారు. ప్రస్తుతం వీరు ఆ ప్రాంతంలో హీరోలుగా మారారు. వీరిని సోమవారం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కలిశారు. వీరిపేర్లు శక్తి సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌. వీరిది రాజ్‌సమండ్‌ జిల్లాలోని తాల్‌ గ్రామం.

ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్‌  హత్య చేసిన తర్వాత నిందితులు బైక్‌పై పారిపోయారు. దీంతో తాల్‌ గ్రామంలోని శక్తిసింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌కు ఓ పోలీస్‌ మిత్రుడు ఫోన్‌ చేసి అటువైపుగా వస్తున్న నిందితులను అనుసరించాలని కోరాడు. ఈ క్రమంలో శక్తి, ప్రహ్లాద్‌కు స్థానిక బస్టాండ్‌ వద్ద నిందితులు కనిపించారు. వెంటనే వారిద్దరూ పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు.. నిందితులను 30 కిలోమీటర్ల మేరకు వెంబడించారు. వీరి ప్రయాణ మార్గం మొత్తంలో పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. ఒక దశలో హంతకులు గౌస్‌ మహమ్మద్‌, మహమ్మద్‌ రియాజ్‌లు వీరిని తమ వద్ద కత్తులతో భయపెట్టేందుకు ప్రయత్నించారు కూడా. ఎట్టకేలకు పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ప్రాణాలకు తెగించి పోలీసులకు సాయం చేసిన వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్‌పుత్‌ కర్ణిసేన నేషనల్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌సింగ్‌ మక్రాన కోరారు. 

ఐదో నిందితుడి అరెస్టు..

దర్జీ హత్య కేసులో ఐదో నిందితుడు మోహసిన్‌ను  సోమవారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొంది. అతడిని జైపూర్‌ న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. జులై 12 వరకు రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని