Published : 10 Dec 2021 23:18 IST

Terrorist attack: కశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరి వీరమరణం

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో మళ్లీ అలజడి రేగింది. ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. ఇక్కడి బందిపొరా జిల్లాలో శుక్రవారం పోలీసు బృందంపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక గుల్షన్ చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని.. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.

‘బందిపొరా గుల్షన్ చౌక్ ప్రాంతంలో పోలీసు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితులను సమీక్షిస్తున్నారు’ అని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ దాడిని ఖండిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇటీవల వరుస పౌర హత్యల తర్వాత కశ్మీర్‌ లోయలో జరిగిన మొదటి అతిపెద్ద ఉగ్ర దాడి ఇదే. అయితే, గత రెండు నెలల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో పౌర హత్యల వెనుక ఉన్న ఉగ్రవాదులందరూ హతమయ్యారని పోలీసులు ఇదివరకే వెల్లడించారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని