Indian army: భారత్‌-చైనా సరిహద్దులో ఇద్దరు సైనికుల గల్లంతు!

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు గల్లంతయ్యారు.......

Published : 12 Jun 2022 01:46 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు గల్లంతయ్యారు. గత నెల 28వ తేదీ నుంచే హరేంద్ర నేగీ, ప్రకాశ్‌సింగ్‌ రాణా అనే సైనికులు కనిపించకుండా పోయినట్లు సమాచారం. ప్రకాశ్‌ రాణా భార్య మమతా రాణా ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘నా భర్త నిన్నటి నుంచి కనిపించడంలేదంటూ మే 29న ఆర్మీ అధికారులు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయనతోపాటు మరో సైనికుడి జాడ తెలియడం లేదని తెలిపారు. ఈ నెల జూన్‌ 9న మరోసారి ఫోన్‌ చేసి ఇద్దరు సైనికులు నదిలో మునిగిపోయి చనిపోయారని భావిస్తున్నాం’ అని అధికారులు పేర్కొన్నట్లు మమత వెల్లడించారు.

ఈ వార్త తెలిసి హరేంద్ర నేగీ భార్య పూనమ్‌ నేగీ శోకసంద్రంలో మునిగిపోయారు. తన భర్త నదిలో మునిగిపోయి చనిపోయారనే నిజాన్ని నమ్మడం కష్టంగా ఉందని, నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అసలేం జరిగిందో ఆర్మీ వివరణ ఇవ్వాలని కోరారు. హరేంద్ర నేగీ దంపతులకు మూడేళ్ల క్రితమే వివాహం జరగగా.. వారికి ఏడాది పాప ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని