Viral news:వాఘా సరిహద్దులో 2 వేల క్రితం నాటి బుద్ధుడి విగ్రహం స్వాధీనం

దాదాపు 2 వేల ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని అమృత్‌సర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీ.శ 2 లేదా 3వ శతాబ్దం నాటిదై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

Published : 12 Nov 2022 02:05 IST

అమృత్‌సర్‌: దాదాపు 2 వేల ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని అమృత్‌సర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది క్రీ.శ 2 లేదా 3వ శతాబ్దం నాటిదై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఓ విదేశీ వ్యక్తి భారత్‌, పాక్‌ సరిహద్దు అట్టారీ-వాఘా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు ద్వారా భారత్‌లోకి ప్రవేశించాడని,  అతడి లగేజీని పరిశీలించగా.. బ్యాగులో బుద్ధుడి విగ్రహం బయటపడినట్లు అమృత్‌సర్‌ కస్టమ్స్‌ కమిషనర్‌ రాహుల్‌ నంగారే తెలిపారు. విగ్రహం గుర్తించిన వెంటనే ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. వారు అందించిన వివరాల ప్రకారం ఈ విగ్రహం క్రీ.శ 2 లేదా 3వ శాతాబ్దానికి చెందినదిగా ధ్రువీకరించినట్టు తెలిపారు. భారత పురాతన వస్తువుల చట్టం 1972 ప్రకారం దీన్ని పురాతన వస్తువుగా పరిగణించి, స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, దీని వెనక ఎవరున్నారన్న దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని