Corona Third wave: కరోనా థర్డ్‌ వేవ్‌ మన ఇంటిముంగిటే ఉంది.. జాగ్రత్త!

కేరళలో రోజుకు 30వేల కేసులు వస్తున్నాయని.. ఇది ప్రమాదకరమైన సంకేతమని ఉద్ధవ్‌ తెలిపారు. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మహారాష్ట్ర భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు....

Updated : 06 Sep 2021 19:53 IST

ముంబయి: మహారాష్ట్రలో రోజువారీ కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్న వేళ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అక్కడి రాజకీయ పార్టీలకు కీలక విజ్ఞప్తి చేశారు. తక్షణమే నిరసన కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను నిలిపివేయాలని కోరారు. పండుగలు తర్వాతైనా చేసుకోవచ్చన్న ఆయన.. ప్రజల ప్రాణాలు, వారి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇద్దామని విజ్ఞప్తి చేశారు. రోజువారీ కేసులు పెరుగుతుంటే పరిస్థితి చేయిదాటిపోవచ్చని ఓ ప్రకటనలో ఉద్ధవ్‌ పేర్కొన్నారు. పండుగలు, మతపరమైన కార్యక్రమాలపై ఎవరూ ఆంక్షలు విధించాలనుకోరని, ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు. రాబోయే పండుగ రోజులు అత్యంత కీలకమన్న ఉద్ధవ్‌.. కరోనా నివారణలో ఈ సమయం సవాలేనన్నారు. పరిస్థితులను నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైనా ఉంటుందని గుర్తు చేశారు. కరోనా థర్డ్‌ వేవ్‌ మన ఇంటిముంగిటే ఉందని హెచ్చరించారు.

కేరళలో రోజుకు 30వేల కేసులు వస్తున్నాయని.. ఇది ప్రమాదకరమైన సంకేతంగా ఉంది. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మహారాష్ట్ర భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ముంబయిలో రోజూ 400లకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో 4,057 కొత్త కేసులు, 67 మరణాలు నమోదు కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 64.86లక్షలకు చేరగా.. 1.7లక్షల మందికి పైగా మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని