UGC NET exam వాయిదా 

యూజీసీ -నెట్‌ 2021 పరీక్ష వాయిదా పడింది. మే 2 నుంచి 17 వరకు జరగాల్సిన ఈ...

Published : 20 Apr 2021 20:44 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌ 2021 పరీక్ష వాయిదా పడింది. మే 2 నుంచి 17 వరకు జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు  నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాలో ట్విటర్‌లో ప్రకటించారు. కరోనా ఉద్ధృతి వేళ అభ్యర్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షను వాయిదా వేయాలని ఎన్‌టీఏ డీజీకి తాను సూచించినట్టు మంత్రి పేర్కొన్నారు.యూజీసీ-నెట్‌ పరీక్ష కొత్త తేదీలను పరీక్ష నిర్వహణకు 15 రోజుల ముందుగానే అభ్యర్థులకు తెలియపరుస్తామని ఎన్‌టీఏ ప్రకటనలో తెలిపింది. 

ఆన్‌లైన్‌లో జరగాల్సిన ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2నుంచి మార్చి 2 వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ పరీక్షలో స్కోరు సాధిస్తే జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని