UGC: కొత్త ఓటర్ల కోసం యూజీసీ క్యాంపెయిన్‌

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా కొత్త ఓటర్లను ప్రేరేపించేందుకు యూజీసీ క్యాంపెయిన్‌ చేపట్టింది.

Published : 29 Feb 2024 17:51 IST

దిల్లీ: త్వరలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) వినూత్న క్యాంపెయిన్‌తో ముందుకొచ్చింది. యువ ఓటర్లు, మరీ ముఖ్యంగా కొత్త ఓటర్లను దృష్టిలోఉంచుకొని కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి వారిలో అవగాహన పెంచేందుకు కార్యాచరణను ప్రారంభించింది. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఓటు వేసేందుకు ‘నా తొలి ఓటు దేశం కోసం’ పేరిట యువతను సమీకరించి.. వారిలో ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు యూజీసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్ కుమార్‌ అన్నారు.

దేశవ్యాప్తంగా కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని జగదీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.  ఈ ప్రచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, విద్యాశాఖ, ఇతర వనరుల నుంచి సమకూరిన మెటీరియల్‌తో పాటు వీడియోలు, బ్యానర్లు, సెల్ఫీ పాయింట్లను ఉపయోగించుకుంటాయని చెప్పారు. బుధవారం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌ మార్చి 6 వరకు కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో నిర్దేశిత ప్రదేశాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని