Aadhaar: ఉడాయ్‌కి జరిమానా విధించే అధికారం!

దేశంలో ఆధార్‌ వినియోగంలో ఉల్లంఘనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ వ్యవస్థను నిర్వహిస్తోన్న ఆధార్‌ ప్రాధికార సంస్థ ‘ఉడాయ్‌’కు ఆధార్‌ ఉల్లంఘలపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన అధికారంతో

Updated : 05 Nov 2021 17:29 IST

దిల్లీ: దేశంలో ఆధార్‌ వినియోగంలో ఉల్లంఘనలు జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ వ్యవస్థను నిర్వహిస్తోన్న ఆధార్‌ ప్రాధికార సంస్థ ‘ఉడాయ్‌’కు ఆధార్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన అధికారంతో ఉడాయ్‌ సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి గరిష్ఠంగా రూ. కోటి వరకు జరిమానా విధించవచ్చు. ఫిర్యాదుల పరిశీలనకు న్యాయధికారులను నియమించుకునే అవకాశం కూడా ఉడాయ్‌కే ఉంటుంది. కాగా.. న్యాయాధికారులు విధించిన జరిమానాలపై అప్పీలు చేసుకోవాలంటే టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్‌.. అప్పిలేట్‌ అథారిటీగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని