Travel restrictions: భారతీయ ప్రయాణికులకు బ్రిటన్‌ ఆంక్షల సడలింపు

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు పలు ఆంక్షలను సడలిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ దేశానికి వచ్చే భారతీయలు ఇకపై 10 రోజులపాటు హోటల్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తమ ఇంట్లోనే లేదా వారు

Published : 05 Aug 2021 23:40 IST

లండన్‌: కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు పలు ఆంక్షలను సడలిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ దేశానికి వచ్చే భారతీయలు ఇకపై 10 రోజులపాటు హోటల్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తమ ఇంట్లోనే లేదా వారు ఉంటున్న ప్రదేశంలో 10 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయవచ్చని పేర్కొంది. ఈ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బ్రిటిష్ హైకమిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. సెకండ్‌ వేవ్ కారణంగా బ్రిటన్‌కు వెళ్లలేకపోయిన వేలాది భారతీయులు.. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు తాజా నిర్ణయంతో ఊరట లభించనుంది.

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన "రెడ్-అంబర్-గ్రీన్ ట్రాఫిక్ లైట్ రేటింగ్స్" సమీక్షలో భాగంగా భారత్‌ను రెడ్‌ లిస్ట్‌ నుంచి అంబర్‌ జాబితాలోకి బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం చేర్చింది. మన దేశంతోపాటు బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏయీలను కూడా ఇదే జాబితాలోకి మార్చింది. కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతోనే ఈ దేశాలకు ఆంక్షలను సడలించినట్టు పేర్కొంది. అయితే బ్రిటన్‌కు వచ్చేవారు ప్రయాణ సమయానికి మూడు రోజుల ముందు వ్యవధిలో తప్పనిసరిగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అన్ని దేశాలకు సంబంధించిన కొవిడ్ సమాచారాన్ని భవిష్యత్తు సమీక్ష కోసం తమ వద్ద అందుబాటులో ఉంచుకోనున్నట్టు వివరించింది. రానున్న కాలంలో తమ దేశంలో కొవిడ్‌ వ్యాప్తిని అనుసరించి అవసరమైతే ఆంక్షల విధింపునకు వెనకాడబోమని స్పష్టం చేసింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని