Published : 16 Oct 2021 02:41 IST

UK MP Stabbed: బ్రిటన్‌ ఎంపీ దారుణ హత్య.. కత్తితో పలుమార్లు పొడిచి చంపిన నిందితుడు

లండన్‌: బ్రిటన్‌కు చెందిన ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్‌ వెస్ట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్‌ అమీస్‌(69) శుక్రవారం స్థానికంగా లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో పౌరులతో వారాంతపు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి, కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కౌన్సిలర్, సౌత్‌ఎండ్ మాజీ మేయర్ జాన్ లాంబ్ సైతం కత్తిపోట్ల విషయాన్ని నిర్ధారించారు.

ప్రజాప్రతినిధుల తీవ్ర దిగ్భ్రాంతి

డేవిడ్‌ అమీస్‌.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత. 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. జంతు సమస్యలతోపాటు మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు స్థానికంగా గుర్తింపు ఉంది. ఆయన మృతిపై తోటి ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఈ ఘటనను ‘భయంకరం.. తీవ్ర దిగ్భ్రాంతికరం’గా అభివర్ణించారు. గతంలోనూ పలువురు బ్రిటీష్ ఎంపీలపై దాడులు జరిగాయి. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్‌ను కాల్చి చంపారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్ కత్తిపోట్లకు గురయ్యారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని