
Omicron: ‘దక్షిణాఫ్రికాలో కంటే ఇంగ్లాండ్‌లోనే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి’
లండన్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. దక్షిణాఫ్రికాలో కంటే ఇంగ్లాండ్‌లోనే వేగంగా వ్యాప్తి చెందుతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ జాన్ ఎడ్మండ్స్ అంచనా వేశారు. క్రిస్మస్ నాటికి రోజుకు 60 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. టెస్టుల ద్వారా బయటపడుతున్న దానికంటే ఎక్కువ కేసులే ఉండొచ్చంటూ ఆయన రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ వెబినార్‌లో తెలిపారని ఓ వార్తసంస్థ పేర్కొంది. ఈ స్ట్రెయిన్‌ను ‘వెరీ సివియర్ సెట్‌బ్యాక్’గా అభివర్ణించిన ఆయన.. వీలైనంత త్వరగా బూస్టర్ డోసు పొందాలని పౌరులను కోరినట్లు చెప్పింది.
‘నెలాఖరుకు పది లక్షల కేసులు’
మరోవైపు రాబోయే రెండు నుంచి నాలుగు వారాల్లో స్థానికంగా బయటపడే మొత్తం కేసుల్లో సగం ఒమిక్రాన్ కేసులే ఉంటాయని భావిస్తున్నట్లు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. గత రెండు వారాల్లో నమోదైన కేసుల వృద్ధి రేటు ఆధారంగా ఈ అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత ఉద్ధృతి ఇలాగే కొనసాగితే.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య పది లక్షలు దాటొచ్చని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ సైతం ఇటీవలే హౌస్ ఆఫ్ కామన్స్‌కు తెలిపారు. మరోవైపు స్థానికంగా కొవిడ్ నిబంధనల అమలు కఠినతరం చేశారు. ఇంటి నుంచి పని, మాస్క్ వినియోగం, కొవిడ్ పాస్ వాడకాన్ని తప్పనిసరి చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.