తాజ్‌మహల్ వద్ద అనుమానాస్పద డబ్బా కలకలం

ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సిబ్బంది  విస్తృత తనిఖీలు నిర్వహించారు....

Published : 03 Apr 2021 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో భద్రతా సిబ్బంది  విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అందులో ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నాయని తెలుసుకొని అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజ్‌మహల్‌ సమీపంలోని పురాణీ మండీ ప్రాంతం షాజహాన్‌ గార్డెన్‌ వద్ద ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే తాజ్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌కు తెలియజేశారు. బాంబు నిర్వీర్య దళం ప్రత్యేక కిట్‌ ధరించి అత్యంత జాగ్రత్తగా క్యాన్‌ తెరిచింది. అయితే అందులో పేలుడు పదార్థాలు లేవని, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని తేల్చింది. బాంబ్‌ స్క్వాడ్‌ క్యాన్‌ను తెరిచే సమయంలో ఆ మార్గం వైపు వెళ్లకుండా పోలీసులు వాహనాలను నిలిపివేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని