yogi adityanath: మోదీ నాయకత్వంలో అభివృద్ధికి చిరునామాగా వారణాసి

ప్రధాని మోదీ నాయకత్వంలో వారణాశి అభివృద్ధికి చిరునామాగా మారిందని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కొనియాడారు. శుక్రవారం వారణాశిలో జరిగిన ఆలిండియా మేయ

Published : 17 Dec 2021 16:43 IST

వారణాసి: ప్రధాని మోదీ నాయకత్వంలో వారణాసి అభివృద్ధికి చిరునామాగా మారిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కొనియాడారు. శుక్రవారం వారణాసిలో జరిగిన ఆలిండియా మేయర్స్‌ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..ప్రపంచంలోని అత్యంత దార్శనికత, ప్రజాదరణ కలిగిన నాయకుడు తమ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు వారణాసి ప్రజలు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. గత ఏడేళ్లలో ప్రధాని పర్యవేక్షణలో కాశీ దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. కాశీలో సంస్కృతిని పరిరక్షిస్తూనే ఆధునిక హంగులతో కాశీని ప్రపంచం ముందు నిలిపే ప్రయత్నం చేశారని ప్రశంసించారు. ప్రధాని మోదీ, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌పూరీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కాన్ఫరెన్స్‌లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మేయర్లు పాల్గొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని