
Dawood Ibrahim: పాకిస్థాన్‌లోనే దావూద్ ఇబ్రహీం.. కీలక సమాచారం రాబట్టిన ఈడీ!
దిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. కాగా వాటిని నిజం చేస్తూ ఎన్ఫోఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక సమాచారాన్ని రాబట్టింది. దావూద్ పాక్‌లోని కరాచీలో ఉన్నట్లు అతడి అల్లుడు (దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు) అలీషా పార్కర్ ఈడీకి తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి.
మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని అలీషా పార్కర్‌కు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు. అలీషా వాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ‘నేను పుట్టక ముందే దావూద్ ముంబయి వదిలి వెళ్లాడు. 1986 వరకు దంబర్వాలా భవన్లో నివసించాడు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నట్లు చాలా మంది మా బంధువుల ద్వారా తెలిసింది. వాళ్లు భారత్‌ను విడిచివెళ్లినప్పుడు నేను ఇంకా పుట్టనేలేదు. వారితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు నా భార్య ఆయేషా, నా సోదరీలతో మా మామ దావూద్ భార్య మెహ్జబీన్ మాట్లాడినట్లు తెలుసు’ అని అలీషా పార్కర్ చెప్పినట్లు వెల్లడించాయి.
దావూద్‌కు అక్రమంగా డబ్బు సంపాదించిపెట్టడంతోపాటు, అతడి హవాలా మార్గాల ద్వారా మనీలాండరింగ్‌కు సహకరించిన దావూద్ బంధువులపై ఈడీ విచారణ జరుపుతోంది. అంతకుముందు ఫిబ్రవరిలో ఈ కేసులో చోటా షకీల్ బావ సలీం ఫ్రూట్‌ను ఈడీ విచారించింది. తాజాగా అతడి మేనల్లుడు అలీషా పార్కర్‌ను ప్రశ్నించింది. అయితే తనకు ఎలాంటి లావాదేవీల గురించి తెలియదని అలీషా వెల్లడించినట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణ’ సినిమాలు..‘చారాణ’ కలెక్షన్లు!
-
Politics News
Andhra News: చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
-
Politics News
Maharashtra Crisis: శివసేనను భాజపా అంతం చేయాలనుకుంటోంది: ఉద్ధవ్ ఠాక్రే
-
Crime News
Crime News: వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి
-
India News
India Corona : 90 వేలు దాటిన క్రియాశీల కేసులు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం