కోల్‌కతా దుర్గా పూజకు యునెస్కో వారసత్వ హోదా

దుర్గా పూజకు వారసత్వ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటింది. దీంతో పశ్చిమబెంగాల్‌  ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజను యూనెస్కో వారసత్వ జాబితాలో పొందుపరిచినట్లు యునెస్కో ట్విట్టర్‌లో ప్రకటించింది.

Published : 15 Dec 2021 22:45 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుర్గా పూజకు అరుదైన గౌరవం దక్కింది. మానవ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు యునెస్కో ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. భారత దేశానికి అభినందనలు తెలుపుతూ, దుర్గా మాత విగ్రహాన్ని పోస్ట్‌ చేసింది. యునెస్కో ట్వీట్‌ను ప్రధాని మోదీ తన ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ, సంతోషించదగ్గ సందర్భంగా అభివర్ణించారు. దీనిపట్ల పశ్చిమ బెంగాల్‌ వారసత్వ కమిషన్‌ ఛైర్మన్‌ సువప్రసన్న, అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని