Union Budget 2022: ఈసారీ కాగిత రహిత బడ్జెటే

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కాగితరహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరిందని చెప్పడానికి గుర్తుగా అందులో పాల్గొన్న ముఖ్యమైన సిబ్బందికి

Updated : 28 Jan 2022 06:03 IST

సిబ్బందికి హల్వాకు బదులు మిఠాయిల పంపిణీ

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కాగితరహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరిందని చెప్పడానికి గుర్తుగా అందులో పాల్గొన్న ముఖ్యమైన సిబ్బందికి ఏటా అందించే హల్వాకు బదులుగా ఈసారి మిఠాయిలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బడ్జెట్‌ను గోప్యంగా ఉంచడం కోసం కొందరు ముఖ్యమైన సిబ్బందిని ఆర్థికశాఖ కార్యాలయంలోని బడ్జెట్‌ ప్రెస్‌లో ఉంచి తాళం వేస్తారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకూ వారు అక్కడే ఉంటారు. 2021-22 బడ్జెట్‌ను తొలిసారి కాగిత రహిత రూపంలో అందించారు. ప్రజలు, ఎంపీలకు బడ్జెట్‌ వివరాలు అందుబాటులో ఉంచేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చారు. 2022-23 బడ్జెట్‌ కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని