Modi: జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది : మోదీ

దేశంలో డిజిటల్ విభజన వేగంగా తగ్గిపోతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో తాజాగా బడ్జెట్‌ దోహదం చేస్తుందని తెలిపారు.

Published : 21 Feb 2022 13:36 IST

దిల్లీ: దేశంలో డిజిటల్ అంతరం వేగంగా తగ్గిపోతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అలాగే జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో తాజాగా బడ్జెట్‌ దోహదం చేస్తుందని తెలిపారు. ‘పోస్ట్ బడ్జెట్ సెమినార్‌: ఫోస్టరింగ్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ- స్కిల్ లింకేజ్‌’ అనే అంశంపై ఆయన వెబినార్‌లో మాట్లాడుతూ.. డిజిటల్ విద్య ఆవశ్యకతను తెలియజేశారు.

‘ఈ కరోనా మహమ్మారి వేళ.. డిజిటల్ కనెక్టివిటీ మన విద్యావ్యవస్థను సజీవంగా ఉంచుతోంది. అలాగే జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అంతేగాకుండా మనదేశంలో డిజిటల్‌ అంతరం ఎంత వేగంగా తగ్గిపోతుందో చూస్తూనే ఉన్నాం. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం అనేది ఒక అద్భుతమైన నిర్ణయం. ఇది సీట్ల కొరతను అధిగమిస్తుంది. అపరిమితమైన సీట్లు అందుబాటులో ఉంటాయి. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ విశ్వవిద్యాలయం పనులు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖను కోరుతున్నాను. ఇ-విద్య, వన్‌ క్లాస్‌ వన్ ఛానల్,  డిజిటల్ ల్యాబ్స్, డిజిటల్ విశ్వవిద్యాలయం.. ఇలా ఏదైనా కావొచ్చు. ఆ సదుపాయాలన్నీ యువతకు ఎంతో లబ్ధి చేకూర్చనున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేదలు, దళితులు, వెనకబడిన వర్గాలు.. ఇలా అందరికీ విద్యనందించే క్రమంలో ఇదొక ప్రయత్నం’ అని తెలిపారు. 

ఫిబ్రవరి 21.. ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఈ వెబినార్‌లో భాగంగా మోదీ ఆ విషయాన్ని ప్రస్తావించారు. మాతృభాషలో విద్య.. మానసిక వికాసానికి సంబంధించిందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు వైద్య, సాంకేతిక విద్యను స్థానిక భాషల్లో బోధించడం ప్రారంభించాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని