టీకా కొరత లేదు.. అవన్నీ ఆరోపణలే: కేంద్రం

మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందంటూ ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ....

Published : 08 Apr 2021 01:07 IST

దిల్లీ: మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందంటూ ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పందించారు. ఆ ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాలు కరోనాపై పోరును రాజకీయం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కరోనాను మహారాష్ట్ర కట్టడి చేయలేకపోయిందని ఆక్షేపించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కరోనాను కట్టడిలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అర్హత కలిగిన వారికి టీకాలు వేయకుండా.. అందరికీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ.. ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడం తగదని మండిపడ్డారు. మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు కరోనాను నియంత్రించడంలో పదేపదే విఫలమవుతున్న అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు. ఇవి బాధ్యతారాహిత్యంతో చేసిన వ్యాఖ్యలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు