Omicron Scare: కనీసం 48 గంటలకు సరిపడా ఆక్సిజన్ స్టాక్ ఉంచుకోవాలి

దేశంలో కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.

Published : 12 Jan 2022 14:44 IST

రాష్ట్రాలకు సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: దేశంలో కరోనావైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. ఈ సమయంలో వైద్య కేంద్రాల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ వెల్లడించారు. కనీసం 48 గంటలకు సరిపడా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. 

* ఇన్‌ పేషెంట్ కేర్, ఆక్సిజన్ చికిత్స అందించే కేంద్రాల వద్ద 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ కలిగి ఉండాలి

* వైద్య కేంద్రాల వద్ద లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్‌ఎంఓ) ట్యాంకులు తగినస్థాయిలో నింపి ఉండాలి. వాటి రీఫిల్లింగ్ విషయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలి. 

* పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలి.

* ప్రాణాధార వ్యవస్థకు సంబంధించిన అన్ని పరికరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. అవసరానికి తగ్గట్టుగా స్పందించేందుకు వీలుగా అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే ఆక్సిజన్ డెలివరీ పరికరాలను వినియోగించేప్పుడు ఇన్ఫెక్షన్ నివారణ ప్రొటోకాల్‌ను అనుసరించాలి. 

* ఆక్సిజన్ సంబంధ సమస్యలు, సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు ఆక్సిజన్ కంట్రోల్‌ రూమ్‌లను పునరుద్ధరించాలి. అలాగే వైద్య కేంద్రాల వద్ద ఆక్సిజన్ నిర్వహణ నిమిత్తం శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని