Anurag Thakur: రణ్వీర్తో కలిసి స్టెప్పులేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌తో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్టెప్పులు వేశారు.
దుబాయ్: యూఏఈ పర్యటనలో ఉన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దుబాయ్ ఎక్స్పో 2020ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలోని ఇండియన్ పెవిలియన్‌కు చేరుకున్న ఆయన బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వీడియా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం యూఏఈకి చేరుకుంది. ఎక్స్‌పోలో భాగంగా భారతీయ మీడియా, వినోద రంగానికి సంబంధించి రణ్వీర్ సింగ్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ సందర్భంగా ‘గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ’పై జరిగిన చర్చలో భాగంగా ఇరువురు కలిసి స్టెప్పులు వేశారు. ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని మల్హరీ పాటకు రణ్వీర్ను అనుకరిస్తూ అనురాగ్ ఠాకూర్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అనురాగ్ ఠాకూర్ కార్యాలయం ట్వీట్ చేసింది.
దుబాయ్ ఎక్స్పోలోని భారత ఎగ్జిబిషన్‌ను చూసేందుకు దాదాపు 17 లక్షల మంది తరలివచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో యోగ, ఆయుర్వేదం, పర్యాటకం, టెక్ట్స్‌టైల్స్, కాస్మిక్ వరల్డ్, సినిమా వరల్డ్ తదితర అంశాలకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ వినోద, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురితో వరుస చర్చలు జరిపారు. అంతేకాకుండా ఎక్స్పోలోని యూఏఈ, సౌదీ అరేబియా, ఇటలీ పెవిలియన్స్‌ను కూడా అనురాగ్ ఠాకూర్ సందర్శించారు. ఆరు నెలల పాటు సాగే దుబాయ్ ఎక్స్పో గత అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఇందులో 192 దేశాలు పాల్గొన్నాయి. భారత్‌లోని 15 రాష్ట్రాలు, 9 కేంద్ర మంత్రిత్వశాఖలు ఈ ఎక్స్‌పోలో భాగమయ్యాయి. ఈ ఎక్స్పో ఈ నెల 31తో ముగియనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
-
Crime News
Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
-
India News
JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!
-
General News
Ts High court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ చేసేందుకు సీజే అనుమతి కోరండి: హైకోర్టు