wife’s day: ‘భార్యా దినోత్సవం’ జరుపుకోవాల్సిందే.. కేంద్ర మంత్రి డిమాండ్‌

మాతృ దినోత్సవం తరహాలోనే భార్యా దినోత్సవం కూడా జరుపుకోవాలని కేంద్ర సామాజికన్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే డిమాండ్‌ చేశారు.

Updated : 10 Sep 2022 14:28 IST

ముంబయి: మాతృ దినోత్సవం తరహాలోనే భార్యా దినోత్సవం కూడా జరుపుకోవాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘తల్లి జన్మనిస్తుంది. అదేవిధంగా భర్త మంచి, చెడుల్లో భార్య పాలుపంచుకుంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అటువంటప్పుడు భార్య దినోత్సవం కూడా జరుపుకోవాల్సిందే’ అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే పేర్కొన్నారు. ప్రతి ఏడాది మే నెలలో రెండో ఆదివారం రోజున అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని