రాహుల్‌జీ.. చదవలేరా? అర్థం చేసుకోలేరా? 

దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాల సరఫరా గురించి కేంద్రం చేసిన

Published : 02 Jul 2021 13:18 IST

కాంగ్రెస్‌ నేత ‘వ్యాక్సిన్‌’ ట్వీట్‌కు హర్షవర్ధన్‌ కౌంటర్‌

దిల్లీ: దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాల సరఫరా గురించి కేంద్రం చేసిన ప్రకటనను రాహుల్‌ అర్థం చేసుకోలేకపోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కరోనా టీకాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘జులై వచ్చింది.. వ్యాక్సిన్లు రాలేదు’’ అని పేర్కొన్నారు. దీనికి Wherearevaccines అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. అయితే ఈ ట్వీట్‌కు హర్షవర్ధన్‌ బదులిస్తూ.. రాహుల్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘జులై నెలలో వ్యాక్సిన్‌ లభ్యత గురించి నిన్ననే నేను ప్రకటన చేశాను. అయినా రాహుల్‌జీ సమస్య ఏంటో? ఆయన చదవలేరా? లేదా అర్థం కాలేదా? అహంకారం, నిర్లక్ష్యం వంటి వైరస్‌లకు ఎలాంటి టీకా లేదు..! నాయకత్వ మార్పుల గురించి కాంగ్రెస్‌ ఆలోచించాల్సిందే..!!’’ అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

అటు మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా స్పందిస్తూ.. రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘జులైలో 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి గాక, ప్రైవేటు ఆసుపత్రులకు మరికొన్ని సరఫరా కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను 15 రోజుల ముందే రాష్ట్రాలకు తెలియజేశాం. కరోనాపై పోరాటంలో తీవ్రమైన విషయాలను పక్కనబెట్టి రాజకీయాలు చేయడం మంచిది కాదనే విషయాన్ని రాహుల్‌ గాంధీ అర్థం చేసుకోవాలి’’ అని గోయల్‌ ట్వీట్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని