Video: పాటతో అదరగొట్టిన కేంద్రమంత్రి.. ఆ సాంగ్‌ విన్నారా?

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి సింగర్‌ అవతారం ఎత్తారు. యువ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో తనదైన గాత్రంతో అదరగొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన.....

Published : 25 Sep 2021 01:18 IST

దిల్లీ: కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి సింగర్‌ అవతారం ఎత్తారు. యువ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో తనదైన గానంతో అదరగొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ యువ అధికారుల ఏడాది శిక్షణ ముగిసిన సందర్భంగా ఇటీవల ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రిజిజు.. తన పాటకు సంబంధించిన ఈ వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు. 1981లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘యారానా’ చిత్రంలోని ‘తేరే జైసా యార్‌ కహాన్‌’ పాట ఆలపించి అందరినీ అలరించారు. స్వయంగా కేంద్రమంత్రి పాడిన పాటను ఎంజాయ్‌ చేసిన యువ అధికారులు ‘వన్స్‌ మోర్‌..’ అంటూ సందడి చేశారు. ఈ పాటను ఆలపించడం వెనుక ఎంతో కృషి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరోవైపు, ఈ సాంగ్‌ వీడియో చూసిన నెటిజన్లు ఆయన టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. ఆయనది మంచి గొంతుక అంటూ పొగుడుతున్నారు. అయితే, కిరణ్‌ రిజిజు పాట ఆలపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనికులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఆయన ఓ పాట ఆలపించారు. 1973లో ధుండ్‌ చిత్రంలో మహేంద్ర కపూర్‌ ఆలపించిన పాటతో ఆకట్టుకున్నారు. నేను గాయకుడినికాదు.. కానీ మన వీర జవాన్ల కోసం పాడుతున్నందుకు గర్వపడుతున్నా అని ట్విటర్‌లో పేర్కొంటూ అప్పట్లో ఆ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని