Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 9.79లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. రోజ్‌గార్ మేళా పేరుతో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నామని అన్నారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో మొత్తం 9.79లక్షల పోస్టులు ఖాళీగా (Govt Vacancies) ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా గ్రూప్-ఏలో 23,584 పోస్టులు, గ్రూప్-బీ 1,18,807, గ్రూప్-సీ 8,36,936 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
రైల్వేలో 2,93,943, రక్షణ రంగంలో (సివిల్) 2,64,704, హోం మంత్రిత్వశాఖలో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మార్చి 1, 2021 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 40,35,203 పోస్టులు మంజూరు కాగా.. ఇప్పటివరకు 30,55,876 పోస్టులు భర్తీ అయినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ‘రోజ్ గార్ మేళా’లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 1.47లక్షల మందికి నియామక పత్రాలు అందజేశామని అన్నారు.
సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS)లోని సెక్షన్ ఆఫీసర్ల కేడర్‌లో కొరత ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. జులై 2022 నాటికి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS), సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (CSSS), సెంట్రల్ సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ (CSCS)లకు సంబంధించిన 8వేల మంది ప్రమోషన్లు పొందారని చెప్పారు. 2013 నుంచి పేరుకుపోయిన ప్రమోషన్లను భర్తీ చేశామని, కేవలం న్యాయస్థానం పరిధిలో ఉన్నవి మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం