UN: భారత్ కోరితే సాయం చేసేందుకు సిద్ధం
కరోనాతో భారత్ సతమతమవుతున్న వేళ.. తమ సమీకృత సప్లై చైన్ ద్వారా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రకటించింది. ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు....
జెనీవా: కరోనాతో భారత్ సతమతమవుతున్న వేళ.. తమ సమీకృత సప్లై చైన్ ద్వారా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రకటించింది. ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. భారత్‌లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి నుంచి సమాచారం తెలుసుకుంటున్నట్లు గుటెర్రస్ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ పేర్కొన్నారు. భారత్‌లో పనిచేసే ఐక్యరాజ్య సమితి విదేశీ సిబ్బంది లేదా భారతీయ సిబ్బంది కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా కష్టకాలంలో ఇప్పటివరకు యూఎన్ నుంచి భారత్‌కు ఏవిధమైన సాయం అందలేదని.. భారత్ కోరుకుంటే మాత్రం సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఎన్ తెలిపింది. మహమ్మారి కట్టడికి ఐక్యరాజ్య సమితి నుంచి సిబ్బందిని పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇప్పటికే భారత్‌లో ఉన్న యూఎన్ సిబ్బంది భారత ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఫర్హాన్ హక్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ap-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..