ముగిసిన హెచ్‌1బి వీసా దరఖాస్తు ప్రక్రియ

హెచ్‌1బి వీసా దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టు అమెరికా ప్రకటించింది.

Published : 18 Feb 2021 18:09 IST

వాషింగ్టన్‌: భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన నిపుణులు, ఉద్యోగుల్లో  డిమాండు ఉన్న హెచ్‌1బి వీసా దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టు అమెరికా ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించినట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది.

అమెరికాలో ఉద్యోగాలను చేపట్టేందుకు వీలు కలిగించే హెచ్‌1బి సాధారణ వీసా విభాగంలో గరిష్ట పరిమితి 65 వేలు.. అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం గలవారికి ఉద్దేశించిన ప్రత్యేక వీసా విభాగంలో 20 వేల దరఖాస్తులు స్వీకరించామని సంస్థ తెలిపింది. దీనితో దరఖాస్తుల పర్వం పూర్తైందని యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. దరఖాస్తుదారులలో అర్హులైన వారిని కంప్యూటర్‌ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. తిరస్కరించబడిన దరఖాస్తుల సమాచారాన్ని సంబంధిత అభ్యర్ధులకు ఇప్పటికే తెలియచేశామని కూడా వారు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని