Maharashtra: గుర్రాలపై వచ్చి.. పెళ్లికాని ప్రసాదుల వింత నిరసన

మహారాష్ట్రలోని శోలాపుర్‌ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 22 Dec 2022 08:26 IST

మహారాష్ట్రలోని శోలాపుర్‌ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి శోలాపుర్‌ కలెక్టరేటు ఎదుట బైఠాయించారు. రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళల సంఖ్య లేదని క్రాంతి జ్యోతి పరిషత్‌ ఛైర్మన్‌ రమేశ్‌ భాస్కర్‌ తెలిపారు. చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా తమకు పెళ్లిళ్లు కావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని వీరు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని