Uttar Pradesh: నకిలీ మార్కుల పత్రంతో అడ్మిషన్.. ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలుశిక్ష 

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ మార్కుల పత్రంతో కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నందుకు.....

Published : 19 Oct 2021 19:30 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని గోసాయ్‌గంజ్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ మార్కుల పత్రంతో కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నందుకు ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష వేసింది. రూ. 8వేల జరిమానా సైతం విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూజా సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేను కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు.

అయోధ్యలోని సాకేత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి 1992లో (29 ఏళ్ల క్రితం) ఇంద్ర ప్రతాప్ తివారీ అలియాస్‌ కబ్బూ తివారీపై కేసు పెట్టారు. తివారీ డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. రెండో ఏడాది ఫెయిల్ అయినప్పటికీ తప్పుడు మార్కుల షీట్‌తో తర్వాతి ఏడాదికి అడ్మిషన్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. రామ జన్మభూమి పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు కాగా.. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ పూర్తయ్యింది. విచారణ సమయంలో.. ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ త్రిపాఠి సైతం మరణించారు. ఆయా పత్రాల జిరాక్సులు, సెకండరీ కాపీలతోనే న్యాయస్థానంలో విచారణ జరిగింది. సాకేత్ కళాశాల మాజీ డీన్ మహేంద్రకుమార్ అగర్వాల్ ..తదితరులు తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని