
Uttar Pradesh: భాజపా ఎమ్మెల్యేకి ఐదేళ్ల జైలుశిక్ష!
లఖ్నవూ: నకిలీ మార్కుల జాబితాతో కాలేజీలో అడ్మిషన్ పొందిన నేరం కింద భాజపాకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ప్రత్యేక కోర్టు.. అనర్హత వేటు వేయడంతోపాటు ఐదేళ్ల జైలు విధించింది. ఉత్తరప్రదేశ్లోని గోసాయ్గంజ్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంద్రప్రతాప్ అలియాస్ ఖబ్బు తివారీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున గెలుపొందారు. కాగా.. ఆయన గతంలో నకిలీ మార్కుల జాబితాతో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం.. ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఆయనని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా పేర్కొంటూ.. ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఇంద్రప్రతాప్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.