
Published : 04 Oct 2020 01:29 IST
సీబీఐకి హాథ్రస్ కేసు
లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీబీఐకి అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రంలోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆ బృందాన్ని ఆదేశించింది. ఈ లోపే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక శనివారం సాయంత్రం పరామర్శించారు. అక్కడికి కాసేపటికే ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి..
Advertisement
Tags :