ఎంఎస్‌పీ హామీ ఎత్తేస్తే పరిస్థితి ఏంటి: ప్రియాంక

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు తమ పంటల్ని బలవంతంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Updated : 21 Dec 2022 15:37 IST

దిల్లీ: ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంబంధిత చట్టాలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు తమ పంటల్ని బలవంతంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా భాజపా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ‘భాజపా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. వారి బాధలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. యూపీలోని చాలా ప్రాంతాల్లో రైతులు తమ ఉత్పత్తిని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు బలవంతంగా అమ్మకుంటున్నారు. వరికి మద్దతు ధర రూ.1868 ఉండగా.. రైతులు రూ.1000 నుంచి రూ.1100లకు అమ్ముకుంటున్నారు. రూ.800 నష్టపోయి అమ్మకుంటున్నారు. మద్దతు ధర హామీ ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంది.. ఒకవేళ దాన్ని తొలగిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’ అని పేర్కొన్నారు. 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. కానీ మరోవైపు కేంద్రం మాత్రం రైతులకు మద్దతు ధర వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోదీ సైతం మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకే వ్వవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టామని.. మద్దతు ధర వ్యవస్థ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు