నా భార్యను దోమలు కుడుతున్నాయ్‌.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు

‘దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కిల్లర్‌ కావాలి’ అంటూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే అతడికి మస్కిటో కిల్లర్‌ను తెచ్చి ఇచ్చారు.

Updated : 23 Mar 2023 07:53 IST

‘దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కిల్లర్‌ కావాలి’ అంటూ ఓ యువకుడు చేసిన ట్వీట్‌కు పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే అతడికి మస్కిటో కిల్లర్‌ను తెచ్చి ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాకు చెందిన అసద్‌ఖాన్‌ ఈ ట్వీట్‌ చేశాడు. ఇతడి భార్య ఆదివారం రాత్రి చందౌసిలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో విపరీతంగా ఉన్న దోమలు అసద్‌ భార్యను.. నవజాత శిశువును తీవ్రంగా కుట్టడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. వారి బాధను చూడలేని అసద్‌ఖాన్‌ మస్కిటో కిల్లర్‌ కోసం బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడం వల్ల దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. ఇక చేసేదిలేక యూపీ పోలీసులకు ట్వీట్‌ చేశాడు. డయల్‌ 112 ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశాడు. వెంటనే స్పందించి ఆసుపత్రికి వచ్చి మరీ అసద్‌ఖాన్‌కు మస్కిటో కిల్లర్‌ను అందించిన పోలీసులు ‘‘మాఫియా నుంచి మస్కిటో వరకు దేన్నైనా ఎదుర్కొంటాం’’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు