Offbeat: స్కీమ్‌ లబ్ధికి తోబుట్టువుతోనే పెళ్లి.. యూపీలో ఘటన!

ప్రభుత్వ పథకం ప్రయోజనాల కోసం ఓ వ్యక్తి తన సోదరినే వివాహం చేసుకున్న ఘటన ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని టుండ్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్‌ యోజన’ లబ్ధి పొందేందుకు ఇటీవల సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో...

Published : 17 Dec 2021 23:17 IST

లఖ్‌నవూ: ప్రభుత్వ పథకం ప్రయోజనాల కోసం ఓ వ్యక్తి తన సోదరినే వివాహం చేసుకున్న ఘటన ఇది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫిరోజాబాద్‌లోని టుండ్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్‌ యోజన’ లబ్ధి పొందేందుకు ఇటీవల సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఓ వ్యక్తి తన సోదరిని వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ జంటను గ్రామస్థులు తోబుట్టువులుగా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జంటకు ఇంటి కానుకలతోపాటు రూ.35 వేల వరకు సాయం అందజేస్తోంది.

టుండ్లా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ప్రాంగణంలో శనివారం ఈ సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఇక్కడ 51 జంటలు పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. అయితే, ఈ తోబుట్టువుల పెళ్లి విషయం తీరా అధికారుల దృష్టికి వెళ్లడంతో.. వారు అవాక్కయ్యారు! బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టుండ్లా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆ సోదరుడి ఆధార్ కార్డు వెరిఫై చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూపీలో ఈ తరహా ఘటనలు ఇదే మొదటిసారి కాదు. 2018లోనూ షామ్లీలో అప్పటికే వివాహమైన 12 జంటలు మళ్లీ పెళ్లి చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని