UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టులెన్నంటే?

యూపీఎస్సీ సివిల్స్‌-2023 పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రిలిమినరీ పరీక్షను మే 28న నిర్వహించనున్నారు.

Updated : 01 Feb 2023 20:41 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి బుధవారం (ఫిబ్రవరి 1) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు.. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు సైతం ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరీక్ష దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 28న జరగనుంది. పరీక్షకు కొద్ది వారాల ముందే ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేయనున్నారు. 

పోస్టులు, ఇతర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని