UPSC: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలను  వాయిదా వేసింది......

Updated : 13 May 2021 15:58 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్‌ వెల్లడించింది. కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 

గతేడాది కూడా కరోనా విలయ తాండవంతోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మే 31న జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలోనే అక్టోబర్‌ 4కు రీషెడ్యూల్‌ చేశారు. ప్రస్తుతానికి రాత పరీక్షలు పూర్తయినప్పటికీ.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తుండటంతో యూపీఎఎస్సీఅన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈపీఎఫ్‌వోలో ఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కోసం మే 9న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలు/ ఇంటర్వ్యూల తదుపరి తేదీలపై అభ్యర్థులకు కనీసం 15 రోజుల ముందుగానే సమాచారం ఇవ్వనున్నట్టు కమిషన్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు