Bengaluru: బెంగళూరు నుంచి నాన్‌స్టాప్ సర్వీసులు.. యూఎస్ ఎయిర్‌లైన్స్ వెనుకడుగు..!
బెంగళూరు నుంచి సియాటెల్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు నేరుగా విమానయాన సేవలు ప్రారంభించాలన్న రెండు అమెరికా సంస్థల యత్నాలు గాడినపడటంలేదు.
ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరు నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌కు నేరుగా విమాన సర్వీసులు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడంలేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వీటిని ప్రారంభించడానికి రెండు అమెరికా విమానయాన సంస్థలు సాహసించడంలేదు. 2020 ఫిబ్రవరిలో ‘అమెరికన్ ఎయిర్‌లైన్స్’ సంస్థ సియాటెల్ నుంచి బెంగళూరుకు నేరుగా విమానాలు నడుపుతామని ప్రకటించింది. అక్టోబర్ 2020 నుంచి వీటిని ప్రారంభిస్తామని పేర్కొంది. బెంగళూరు నుంచి అమెరికాకు ఇదే తొలి నాన్‌స్టాప్ విమానం అయ్యేది. కానీ, కొవిడ్ కారణంగా ఇది అమలు కాలేదు. ఆ తర్వాత యునైటెడ్ ఎయిర్ లైన్స్ కూడా 2021 శీతాకాలం నుంచి బెంగళూరు-శాన్‌ఫ్రాన్సిస్కోకు విమానా సర్వీసులు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఇది కూడా ఆచరణకు నోచుకోలేదు.
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో విమానయాన సంస్థల కార్యకలాపాలు మళ్లీ పెరిగాయి. కానీ, అదే సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైంది. పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా కూడా తన గగనతలంపై ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా విమానయాన సంస్థలు రష్యా గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేశాయి. ఫలితంగా బెంగళూరు నుంచి నేరుగా అమెరికాకు విమానయాన సేవలు నడపడం అసాధ్యంగా మారింది. అమెరికా విమానయాన సంస్థలు పోలార్ మార్గాన్ని ఎంచుకోవడంతో కొత్త సర్వీసులను ప్రారంభించలేకపోతున్నాయని కెంపెగౌడ విమానాశ్రయ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘పోలార్ మార్గం రష్యా గగనతలంపై నుంచి ఉండటంతో సమస్యలను కొనితెచ్చుకోవడమే అని ఆ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో మరింత చుట్టుతిరిగి భారత్‌ను చేరుకొంటున్నాయి. ఆ చుట్టుతిరుగుడు మార్గంలో ప్రయాణించగలిగేంత ఇంధనాన్ని అన్ని విమానాలు తీసుకెళ్లలేవు’’ అని పేర్కొన్నారు. బెంగళూరు శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య 13,993 కిలోమీటర్ల దూరం ఉంది. దీనిని ప్రయాణించడానికి 17 గంటల సమయం పడుతుందని అంచనా. దీంతోపాటు ఈ మార్గంలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలంటే సుమారు 250 మిలియన్ డాలర్లు పెట్టుబడి అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా సంస్థలు అంత మొత్తంలో వెచ్చించే అవకాశం లేదు. ఈ మార్గంలో ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఒక్కటే బెంగళూరు-శాన్ ఫ్రాన్సిస్కో సర్వీసులు నడుపుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్..!