- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Green card: ఫీజు చెల్లిస్తే గ్రీన్‌కార్డ్.. అమెరికా కొత్త బిల్లులో ప్రతిపాదన
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వారు కొంత మొత్తం చెల్లించడం ద్వారా గ్రీన్‌కార్డు పొందొచ్చు. ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో దీనివల్ల లబ్ధి పొందనున్నారు. అయితే, దీనికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల్లో ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. దీంతో హెచ్-1బీ పని వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ జనాభా కలిగిన భారత్, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ ప్రతిపాదిత బిల్లులో గ్రీన్ కార్డుల కోసం దేశాల కోటాను ఎత్తివేయడం, హెచ్1బీ వీసా వార్షిక కోటాకు సంబంధించిన పరిమితులు ఎత్తివేయడం వంటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని శాశ్వత నిర్మాణాత్మక మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. అలాగే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ ఆమోదించాలి. ఆ తర్వాత ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం పొందాలి. అనంతరం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాలుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే అమెరికాకు చిన్నవయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, మహమ్మారి కాలంలో అత్యవసర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఓ విధంగా వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేసినట్లేనని ఇమ్మిగ్రేషన్ పాలసీ అనలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్, చైనీయులే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 న్యూస్
-
Crime News
Hyderabad News: రూ.8 వేలిస్తే.. రూ.50 వేలు
-
Ap-top-news News
Tirumala: అనుచరుల కోసం గంటకుపైగా ఆలయంలోనే మంత్రి రోజా
-
Ap-top-news News
AB Venkateswara Rao: హైకోర్టు ఆదేశించినా జీతభత్యాలు ఇవ్వలేదు
-
Ts-top-news News
Rains: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
- Dengue: మీ పిల్లలకు డెంగీ జ్వరమా..? ఆందోళన అసలే వద్దు..!