Iraq: మరో యుద్ధం నుంచి వైదొలగనున్న అమెరికా దళాలు..!

అమెరికా దళాలు ఈ ఏడాది చివరి నాటికి ఇరాక్‌ను కూడా వీడనున్నాయి. ఈ విషయాన్ని నేడు ఇరాక్‌-అమెరికా ప్రభుత్వాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ మేరకు ఇరుదేశాల కీలక నేతలు నేడు వాషింగ్టన్‌లో

Updated : 29 Feb 2024 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా దళాలు ఈ ఏడాది చివరి నాటికి ఇరాక్‌ను కూడా వీడనున్నాయి. ఈ విషయాన్ని నేడు ఇరాక్‌-అమెరికా ప్రభుత్వాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ మేరకు ఇరుదేశాల కీలక నేతలు నేడు వాషింగ్టన్‌లో సమావేశం అయ్యారు. ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ ఖదీమ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ చర్చల బృందంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, ఇరాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌లు ఉన్నారు. 

ప్రస్తుతం ఇరాక్‌లో 2,500 మంది అమెరికా దళాలు ఉన్నాయి. ఈ దళాలు ఐసిస్‌ను ఎదుర్కోవడంలో ఇరాక్‌కు సహకరిస్తున్నాయి. గతేడాది ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీని డ్రోన్‌తో హతమార్చిన  తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దళాల ఉపసంహరణ ప్రధాన అంశంగా మారింది. అప్పటి నుంచి షియా మిలిషీయాలు వందల సంఖ్యలో రాకెట్లు, మోర్టార్లతో అమెరికా సేనలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా దళాలు ఉండే ఇరాక్‌ సేనల స్థావరాలు దీనికి లక్ష్యంగా మారుతున్నాయి. అమెరికా తాజా నిర్ణయంతో మరో యుద్ధం నుంచి వైదొలగుతున్నట్లైంది. ఈ యుద్ధాన్ని నాటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ మొదలుపెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని