Bipin Rawat: రక్షణ భాగస్వామ్యంలో బిపిన్ రావత్ది కీలక పాత్ర: అమెరికా
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో ఆయన బలమైన ప్రతినిధి అని, ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో
వాషింగ్టన్: భారత సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో ఆయన బలమైన ప్రతినిధి అని, ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడింది.
స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాతో మాట్లాడుతూ ‘‘సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.. అమెరికా-భారత్ రక్షణ భాగస్వామ్యానికి బలమైన ప్రతినిధి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆయన దోహదపడ్డారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కావడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. జనరల్ బిపిన్ రావత్ కుటుంబానికి, ఈ ప్రమాదంలో మృతి చెందిన సైనిక సిబ్బంది కుటుంబాలకి, భారతీయులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’’అని ప్రైస్ చెప్పారు.
సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా రక్షణ రంగం తరఫున సంతాపం తెలియజేస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు. ‘అమెరికా-భారత్ రక్షణ భాగస్వామంలో బిపిన్ రావత్ చెరగని ముద్ర వేశారు. భారత సాయుధ బలగాలు.. ఏకీకృత యుద్ధ సంస్థగా మారడంలో ఆయన కేంద్ర బిందువుగా ఉన్నారు’అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు సైతం బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM