US Visa: నిరుటి రికార్డును తిరగరాస్తాం

భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలను ఇవ్వనున్నామని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

Published : 14 Jun 2024 04:25 IST

విద్యార్థి వీసాలపై అమెరికా ఎంబసీ వెల్లడి

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో వీసాలు పొందినవారితో కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

దిల్లీ: భారతీయ విద్యార్థులకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలను ఇవ్వనున్నామని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. గత ఏడాది 1,40,000 వీసాలు ఇచ్చామని, ఈసారి ఆ రికార్డును తిరగరాసేలాగానీ, దానికి సమానంగా ఉండేలా గానీ ఇస్తామని పేర్కొంది. దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలలో గురువారం 8వ విద్యార్థి వీసా దినోత్సవాన్ని రాయబార కార్యాలయం నిర్వహించింది. ఈ సందర్భంగా దిల్లీ తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ సయ్యద్‌ ముజ్తాబా అంద్రాబీ మాట్లాడారు. గురువారం ఒక్కరోజే 4,000 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని తెలిపారు. సాధారణంగా ఈ సీజనుకు విద్యార్థి వీసాలను జూన్‌ నుంచి ఇస్తామని, కానీ ఈసారి మే నెలలోనే ప్రారంభించామని, ఇది ఆగస్టు ఆఖరు వరకూ కొనసాగుతుందని వెల్లడించారు. బీ1, బీ2 వీసాకు కొత్తగా దరఖాస్తు చేసేవారికి తప్ప మిగిలిన అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూకు వేచి ఉండే సమయాన్ని పూర్తిగా తగ్గించామని పేర్కొన్నారు. బీ1, బీ2 వీసాలకు వేచి ఉండే సమయమూ 70శాతం వరకూ తగ్గిందని తెలిపారు. అమెరికాలో 4,500 అక్రిడిటేటెడ్‌ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని