Corona Vaccine: అమెరికాలో అందరికీ బూస్టర్‌ డోసు!

వ్యాక్సినేషన్‌ భారీగా చేపట్టినా అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ దాదాపు లక్ష కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి అడ్డుకట్ట

Published : 19 Aug 2021 01:28 IST

సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించే అవకాశం

ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని నిపుణుల సూచన

న్యూయార్క్‌: వ్యాక్సినేషన్‌ భారీగా చేపట్టినా అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ దాదాపు లక్ష కేసులతో పాటు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బూస్టర్‌ డోసు అవసరమని నిర్ణయించారు.  డెల్టా కేసులు పెరగడానికి తోడు వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతున్నట్టు తేలడంతో అమెరికన్‌ పౌరులంతా తమ రక్షణను పెంచుకొనేందుకు మూడో డోసు వేయించుకోవాలని సూచిస్తున్నారు. సీడీసీ డైరెక్టర్‌, ఇతర ఉన్నత స్థాయి అధికారులు ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటికే ఫైజెర్‌, మోడర్నా టీకాలు రెండు డోసులు పొంది ఎనిమిది నెలలు పూర్తయిన వారికి మూడో డోసు వేయనున్నారు. ఈ మూడో డోసు పంపిణీ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. 

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా మొదటి డోసు తీసుకున్నవారు కూడా మరో డోసు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన డేటా కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఆ వ్యాక్సిన్‌ భద్రత, ప్రభావంపై ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లతో రక్షణ కాలక్రమేనా తగ్గుతోందనేది మాత్రం స్పష్టమవుతోందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ తాజా అంచనా ప్రకారం.. వ్యాధి తీవ్రత, ఆస్పత్రుల్లో చేరడం, మరణాలను తగ్గించేలా ఈ వ్యాక్సిన్ల రక్షణ నెలల వ్యవధిలోనే తగ్గుతోందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని