చేతులు కలిపేందుకు సిద్ధం.. ఫౌచీ

ప్రపంచ ఆరోగ్య సంస్థతో మళ్లీ చేతులు కలపాలని అమెరికా కోరుకుంటోంది.  

Published : 21 Jan 2021 23:10 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ, కోవాక్స్‌లతో చేరుతామని ప్రకటన

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థతో మళ్లీ చేతులు కలపాలని అమెరికా కోరుకుంటున్నట్టు.. ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌  ప్రధాన వైద్య సలహాదారు అంటోనీ ఫౌచీ ప్రకటించారు. అంతేకాకుండా గతంలో మాదిరిగానే సంస్థకు నిధులను కూడా సమకూర్చనుందని ఆయన తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించేందుకు ఉద్దేశించిన కొవాక్స్‌ కూటమిలో కూడా అమెరికా చేరే యోచనలో ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు బైడెన్‌ ఈ మేరకు నేడు ఓ ఆదేశాన్ని వెలువరిస్తారని.. సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఫౌచీ వెల్లడించారు.  అంతేకాకుండా అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశంగా కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 

అమెరికా తొలి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రధాన దాతగా ఉంటూ వస్తోంది. కాగా, ఈ సంస్థ చైనాకు కొమ్ము కాస్తోందనే నెపంతో.. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత జులై నుంచి సంస్థకు నిధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా టీకా అభివృద్ధి, ప్రపంచ వ్యాప్త పంపిణీయే లక్ష్యంగా అంతర్జాతీయ కూటమి ‘కోవాక్స్‌’ ఏర్పాటైంది. పేద, ధనిక భేదం లేకుండా ప్రపంచ దేశాలన్నిటికీ సమానంగా పంపిణీ చేసే ఈ కార్యక్రమాన్ని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి పర్యవేక్షిస్తున్నాయి. ఐతే సంస్థ నుంచి అమెరికా వైదొలగటంతో ఈ కార్యక్రమాలను నిధుల కొరత పీడిస్తోంది. ఈ నేపథ్యంలో ఫౌచీ ప్రకటనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టే కొవిడ్‌ కట్టడి కార్యక్రమానికి మరింత చేయూత లభించినట్లయింది.

ఇవీ చదవండి..

అందరికీ టీకా లభిస్తుంది..

సీరమ్‌ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు