
Published : 09 May 2021 01:01 IST
China rocket: రాకెట్ కూలేది ఇక్కడే..
వాషింగ్టన్: చైనా రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని అమెరికా రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్‌మెనిస్థాన్‌లో కూలే అవకాశం ఉందని పేర్కొంది. రాకెట్ శకలాలు భూమిని ఢీకొన్న చోట విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనా మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రమాదం ఉండదనే చెబుతోంది. శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా కాలిపోతాయని, ప్రమాదం జరిగే అవకాశాలు అతి స్వల్పమేనని చెబుతోంది. అయితే, ఎక్కడ పడేదీ వెల్లడించలేదు. గత నెల 29న లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్‌ను చైనా ప్రయోగించింది.
ఇవీ చదవండి
Tags :