అమెరికా అధికారుల నోట వెంట హిందీ పాట

అమెరికా నేవీ అధికారులు హిందీ పాటతో అదరగొట్టారు. షారుఖ్‌ పాట పాడి అబ్బురపరిచారు. యూఎస్ నౌకాదళ ఆపరేషన్స్‌ చీఫ్‌ మైకేల్‌ ఎమ్‌ గిల్డే, భారత రాయబారి తరన్‌జిత్‌సింగ్‌ సంధు మధ్య జరిగిన విందు సందర్భంగా అరుదైన ఘటన జరిగింది....

Published : 29 Mar 2021 19:35 IST

వాషింగ్టన్‌: అమెరికా నేవీ అధికారులు హిందీ పాటతో అదరగొట్టారు. షారుఖ్‌ పాట పాడి అబ్బురపరిచారు. యూఎస్ నౌకాదళ ఆపరేషన్స్‌ చీఫ్‌ మైకేల్‌ ఎమ్‌ గిల్డే, భారత రాయబారి తరన్‌జిత్‌సింగ్‌ సంధు మధ్య జరిగిన విందు సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2004లో విడుదలైన షారుక్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలోని ‘యే జో దేశ్‌ హై తేరా’ పాట పాడి అలరించారు. అక్కడే ఉన్న వాయిద్యకారులు సంగీతం అందిస్తుండగా వారు ఈ పాట పాడటం విశేషం. తరన్‌జిత్‌సింగ్‌ సంధు ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికాకు మధ్య ఉన్న బంధానికి ఇది నిదర్శనమని సంధు పేర్కొన్నారు. ఆయన పంచుకున్న ఈ వీడియోను 1.96 లక్షల మంది చూశారు. యూఎస్‌ నేవీ సైతం ఈ వీడియోను పంచుకొంది. భారత్‌కు హోలీ శుభాకాంక్షలు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని