US submarine: సముద్ర గర్భంలో కొండను ఢీకొన్న సీవుల్ఫ్‌..!

అమెరికాకు చెందిన సీవుల్ఫ్‌ శ్రేణికి చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌22) దక్షిణ చైనా సముద్ర గర్భంలోని ఓ కొండను ఢీకొన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ‘యూఎస్‌ఎన్‌ఐ న్యూస్‌’ వెల్లడించింది

Published : 02 Nov 2021 19:41 IST

  అమెరికా నివేదిక

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు చెందిన సీవుల్ఫ్‌ శ్రేణికి చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌22) దక్షిణ చైనా సముద్ర గర్భంలోని ఓ కొండను ఢీకొన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ‘యూఎస్‌ఎన్‌ఐ న్యూస్‌’ వెల్లడించింది. దీంతో విదేశీ నౌకలను, లేదా జలాంతర్గాములను ఢీకొందన్న అనుమానాలకు తెరపడింది. తొలుత దేనిని ఢీకొందో గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది నావికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు నివేదికను  ఇటీవల వైస్‌ అడ్మిరల్‌  కార్ల్‌ థామస్‌కు పంపించారు. ప్రస్తుతం యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌కు  గువాంలో మరమ్మతులు చేస్తున్నారు. దీనిలోని అణు రియాక్టర్లు, ప్రొపెల్షన్‌ సిస్టమ్‌లు దెబ్బతినలేదని అమెరికా పేర్కొంది. 

అమెరికా నావికాదళం ఉపయోగించే సీవుల్ఫ్‌ శ్రేణి అణుశక్తి జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌22) దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అడుగుకు వెళ్లే సమయంలో ఏదో భారీ వస్తువును తాకింది. ఈ ఘటన అక్టోబర్‌ 2వ తేదీన చోటు చేసుకొంది.  ఈ ఘటన వెలుగులోకి రావడం ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అమెరికా సెయిలర్లకు స్వల్ప, మధ్యశ్రేణి గాయాలైనట్లు ఫోర్బ్స్‌ పత్రిక పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు