జాత్యహంకార ఘటనలపై మౌనం వీడాలి: బైడెన్
వాషింగ్టన్: జాత్యహంకార ఘటనలకు విరుద్ధంగా అమెరికన్లు గళం విప్పాలని అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి చేశారు. అట్లాంటాలో ఇటీవల ఆసియన్ అమెరికన్ల మసాజ్ పార్లర్లే లక్ష్యంగా జరిపిన కాల్పుల్ని బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జార్జియాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. అంతకుముందు జార్జియాకు చెందిన ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.
‘ద్వేషం, హింసకు సంబంధించిన ఘటనలు దేశంలో తరచూ చోటుచేసుకుంటున్నప్పటికీ.. మనం మౌనంగా ఉంటున్నాం. ఆ పద్దతిలో మార్పు రావాలి. అలాంటి చట్ట విరుద్ధ ఘటనలను మనం అనుమతించకూడదు. వాటికి వ్యతిరేకంగా గళమెత్తి.. చర్యలు తీసుకోవాలి. జాత్యహంకార ఘటనలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి’ అని ఆసియన్ అమెరికన్ నాయకులకు బైడెన్ విజ్ఞప్తి చేశారు. కాగా, కాల్పుల ఘటనను ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ గాయకురాలు రిహానా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సహా పలువురు ప్రముఖులు ఖండించారు. ఇతరుల పట్ల ద్వేషానికి స్వస్తి పలకాలని వారు విజ్ఞప్తి చేశారు.
అమెరికాలోని అట్లాంటాలో ఇటీవల ఆసియన్ అమెరికన్ మసాజ్ పార్లర్లే లక్ష్యంగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఎనిమిది మంది ఆసియన్ అమెరికన్లు మరణించారు. ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న రాబర్ట్ లాంగ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు అట్లాంటా పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
social look: ‘మిస్బి’గా తమన్నా.. నిఖిల్ రిక్వెస్ట్.. శునకానికి సోనూ ట్రైనింగ్..
-
India News
DGCA: విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ
-
Politics News
KTR: ఉచిత పథకాలన్నీ రద్దు చేసి వచ్చే ఎన్నికలకు వెళ్తారా?: మోదీని ప్రశ్నించిన కేటీఆర్
-
India News
Space: భారత్‌కు అంతరిక్షం నుంచి సందేశం..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు